డిసెంబర్ 5న రాహుల్ గాంధీకి పట్టం


కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. డిసెంబర్‌ 1 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డిసెంబర్‌ 1న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. డిసెంబర్‌ 4న నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 16న ఎన్నికలు నిర్వహించి.. 19న ఫలితాలు వెల్లడించనున్నారు. ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించే ముహూర్తం ఈ రీతిగా ఖరారైంది. రాహుల్‌ గాంధీ తప్ప ఇతరులు నామినేషన్‌ వేయకపోతే పరిశీలన రోజే రాహుల్‌ను అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. డిసెంబర్‌ 5న రాహుల్‌ ఏకగ్రీవ ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడిగా రాహుల్‌ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం