దీపిక, రానా లకు అమరావతి అవార్డులు


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పచ్చదనం ఆకట్టుకుందని బాలీవుడ్‌ నటి దీపికా పదుకోన్‌ పేర్కొన్నారు. ఇక్కడ వేగవంతమైన అభివృద్ధి కనిపించిందని కూడా ఆమె అన్నారు. విజయవాడలో ఏపీ పర్యాటక శాఖ ఆదివారం నిర్వహించిన ‘సోషల్‌ మీడియా సమ్మిట్‌ 2017 అవార్డు’ ప్రదానోత్సవంలో ఆమె పాల్గొన్నారు. సామాజిక మాధ్యమంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా దీపికకు రాష్ట్ర పర్యాటక శాఖ తరఫున మంత్రి భూమా అఖిలప్రియ అవార్డును అందజేశారు. నాకు ఈ గుర్తింపు రావడానికి అభిమానులే కారణం. ఇక్కడా ఇంతమంది అభిమానులు ఉండడం ఆనందంగా ఉంది. ‘థాంక్యూ అమరావతి’. అని దీపికా అన్నారు. తనకు, అభిమానులకు మధ్య ఓ స్పష్టమైన అవగాహన సోషల్ మీడియా ద్వారా కుదిరింది అని అన్నారు. పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ తొలిసారి విజయవాడలో ఈ సదస్సు జరిపామని, భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈసారి ముంబయి నుంచి విజయవాడకు దీపిక నేరుగా వచ్చేలా నాన్ స్టాప్ ఫ్లైట్ సదుపాయం కల్పిస్తామని అన్నారు. సినీ నటుడు దగ్గుబాటి రానా, సంగీత దర్శకుడు అనిరుధ్‌, హాస్యనటుడు వైవా హర్ష కూడా అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం