నారావారితో కొణెదలవారు కలిస్తే..


తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు మనవరాలు.. నట సింహ నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయ.. తెలుగుదేశాధినేత నారా చంద్రబాబు నాయుడు కోడలు.. ఆఁధ్రప్రదేశ్ ఐటి మినిష్టర్ నారా లోకేష్ సతీమణి అయిన నారా బ్రాహ్మణి రక్తదానం చేస్తున్న ఫోటో ఇప్పుడు ఇటు సినీ వర్గాల్లో.. అటు రాజకీయ వర్గాల్లో తెగ హల్ చల్ చేస్తోంది. ఎంత పెద్దింటి కోడలైనా.. ఆడపడుచు అయినా రక్తదానం చేయడం ఎందుకంత సంచలనం సృష్టిస్తోంది? అందుకు కారణం ఏమిటంటే.. ఆ ఫొటోలో ఆమెతో పాటు మరొక అత్యంత ప్రభావంతమైన యంగ్ లేడి ఉండడం. బ్రాహ్మణి బ్యాక్ గ్రౌండ్ కి సరి సమానమైన బ్యాక్ గ్రౌండ్ ఉపాసనకు ఉండడమే అందుకు కారణం. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కి వారసురాల్లో ఒకరు.. మెగాస్టార్ చిరంజీవి కోడలు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సహధర్మచారిణి అయిన ఉపాసన.. బ్రహ్మణి చేసిన రక్తదానాన్ని దగ్గరుండి పర్యవేక్షించడం సహజంగానే చర్చనీయాంశం అవుతోంది. నందమూరి వారసత్వం కలిగిన నారావారి కోడలు.. కొణిదెల వారి కోడలుతో కలిసి ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకోసారి చాలా చాలా చిన్న విషయాలే.. అద్భుతాలకు శ్రీకారం చుడుతుంటాయి. పైగా బ్రాహ్మణి, ఉపాసన ఇద్దరూ ఇంటికి పరిమితమయ్యే ఆడపడుచులు కాదు. తమతమ రంగాల్లో అసాధారణమైన ప్రథాభాపాటవాలు ప్రదర్శిస్తున్నవారు. తమకంటూ సొంతంగా వ్యక్తిత్వం కలిగి ఉన్నవాళ్లు. ఇద్దరూ మహా విద్యాధికులు. అవసరమైతే.. తమ జీవిత భాగస్వాములతో చర్చించి.. ఆ తర్వాత తమ మామగార్లను కూడా ఒప్పించగలిగే సామర్ధ్యం ఉన్నవాళ్లు. కాబట్టి వీరిద్దరి కలయిక ఎటువంటి సంచలనాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. ఒకవేళ నారావారితో కొణిదెల వారు కలిస్తే మాత్రం.. ఇటు సినిమా రంగంలోనూ.. అటు రాజకీయరంగంలోనూ వార్ వన్ సైడ్ అయిపోతుంది. అందులో అణుమాత్రం కూడా సందేహం లేదు!!

ముఖ్యాంశాలు