పవన్ చే తాల్ యూత్ వింగ్ ఆవిష్కరణ


లండన్‌ పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (తాల్‌) కొత్త విభాగం ‘తాల్‌ యూత్‌’ను ఆవిష్కరించారు. విల్లోస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. తాల్‌ ఛైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి మేడిశెట్టి ఓ ప్రకటన విడుదల చేస్తూ యువకులతో పవన్ ముఖాముఖీ నిర్వహించారన్నారు. ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, యూసీఎల్‌, ఎల్‌ఎస్‌బీ, కేసీఎల్‌ వర్సిటీల నుంచి 200 మంది తెలుగు యువకులు దీనికి హాజరయ్యారు. యూత్‌ తాల్‌ వెబ్‌సైట్‌ను పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించారు. యువకుల ప్రశ్నలకు పవన్‌ జవాబులు చెప్పారు. తాల్‌ మాజీ ఛైర్మన్‌ శ్రీధర్‌ వనం మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ యూత్‌ వింగ్‌ను ఆవిష్కరించడం తాల్‌ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. పవన్‌ కల్యాణ్‌ను తాల్‌ బోర్డు ట్రస్టీలు సన్మానించి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం తాల్‌ చిల్డ్రన్స్‌ డే కార్యక్రమం నిర్వహించారు. 50 మంది చిన్నారులు వీణాపాణి కోన నేతృత్వంలో సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. సినీగాయకుడు అనుదీప్‌ దేవరకొండ తెలుగు పాటల కచేరి ఉర్రూతలూగించింది. సౌమ్య వారణాసి, కల్యాణి గేదెల వ్యాఖ్యాతలుగా వ్యవహరిం చారు. తాల్‌ సలహాదారులు డాక్టర్‌ రాములు దాసోజు, రామానాయుడు బోయల్ల, సత్యేంద్ర పగడాల, సంజయ్‌ భిరాజు, డాక్టర్‌ వేణు కవర్తాపు, తాల్‌ బోర్డు ట్రస్టీలు శ్రీధర్‌ మేడిశెట్టి (ఛైర్మన్‌), శ్రీధర్‌ సోమిశెట్ట (వైస్‌ ఛైర్మన్‌, కోశాధి కారి), భారతి కందుకూరి, నిర్మల దవల, మల్లేశ్‌ కోట, గిరిధర్‌ పొట్లూరి, మురళి తాడిపర్తి, రాజేశ్‌ తోలేటి, శ్రీనివాస్‌రెడ్డి కొన్రెడ్డి, సూర్య కందుకూరి, వంశీ మోహన్‌ సింగలూరి, బాలాజి కల్లూరు, రవి మాచర్ల పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు