బరువు తగ్గిన బాలకృష్ణుడు

తాను బాలకృష్ణుడు చిత్రం కోసం 20 కేజీలు బరువు తగ్గానని, ఇకపై ఇలానే ఉంటానని హీరో నారా రోహిత్‌ అన్నారు. బాలకృష్ణుడు లో రోహిత్ హీరో కాగా రెజీనా కథానాయిక. పవన్‌ మల్లెల దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నారా రోహిత్‌ పాత్రికేయులతో మాట్లాడారు. కమర్షియల్‌ సినిమాలు చేయాలి అనే తన కల ‘బాలకృష్ణుడు’తో తీరింది అన్నారాయన. కమర్షి యల్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉన్న చిత్రమిదన్నారు. టైటిల్‌కు తగ్గట్టే తన పాత్ర ఉంటుందన్నారు. ఈ సినిమాకు జగపతిబాబు వాయిస్‌ ఓవర్‌ ప్రధాన ఆకర్షణ అన్నారు. పరుచూరి మురళితో ఓ సినిమా చేస్తున్నా, పవన్‌ సాధినేనితో మరో చిత్రం చేయబోతున్నానని రోహిత్ వెల్లడించారు. 

Facebook
Twitter