యునిసెఫ్‌ బాలల హక్కుల రాయబారిగా త్రిష

యునిసెఫ్‌ సంస్థ బాలల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిషను నియమించారు. కేరళ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘమైన యునిసెఫ్‌ సంస్థ సంయుక్తంగా చిన్నారులకు మీజిల్స్‌ టీకా ఆవశ్యకతపై యాడ్‌ ఫిల్మ్‌ రూపొందించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్‌ తరఫున తమిళనాడు, కేరళ పరిధిలో చిన్నారుల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిష నియమితులయ్యారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై లైంగిక హింస వంటి వాటికి వ్యతిరేకంగా ఆమె పోరాడనున్నారు. చెన్నైలో జరిగిన నియామక కార్యక్రమంలో త్రిష మాట్లాడుతూ ఇది తనకు లభించిన గొప్ప గౌరవమని అన్నారు. చిన్నారుల హక్కుల కోసం గొంతెత్తగలనని ప్రకటించారు. బాలికలు 18 ఏళ్ల వరకు చదువుకుంటే బాల్య వివాహ వ్యవస్థను రూపుమాపడం సాధ్యమన్నారు. 

Facebook