హిట్ లిస్టులో భాజపా అగ్రనేతలు


భారత్‌లో భారీ ఉగ్రవాద దాడికి పాల్పడి భారతీయ జనతా పార్టీ అగ్రనేతలను అంతం చేయాలని ఐఎస్‌ఐ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తో సహా పలువురు భాజపా నేతలను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నారని .. ఈ మేరకు హిట్ లిస్టు ఉందని పేర్కొన్నాయి. ప్రధానంగా ప్రముఖులు పాల్గొనే భారీ బహిరంగ సభల్లో ఉగ్రవాదులు పెద్దఎత్తున దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు తమ హెచ్చరికలో తెలిపాయి. దిల్లీలో జరిగే పలు కార్యక్రమాలను ఉగ్రవాదసంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. గువాహటి నుంచి ఈ మేరకి కీలక సమాచారం అందిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈమేరకు అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు కూడా పంపారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌ జైట్లీ, సుష్మాస్వరాజ్‌, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా, గోవా, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు మనోహర్‌ పారికర్‌, యోగి ఆదిత్యనాథ్‌ తదితరులపేర్లు కూడా హిట్ లిస్టులో ఉన్నాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం