కాంగ్రెస్‌ ముక్త భారత్‌ ఇక సులువే !


తాము కోరుకుంటున్న ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’( కాంగ్రెస్‌ రహిత భారత దేశం) కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌ గాంధీ అధ్యక్షుడైతే సులభం అవుతుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ పట్టాభిషేకానికి రంగం సిద్ధం అవుతున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. సోనియాగాంధీ తర్వాత రాహుల్‌ ఆ పార్టీ పగ్గాలు చేపట్టడంలో కొత్తదనం ఏముందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యాంశాలు