దీపిక ఇంటికి పోలీసు బందోబస్తు


బెంగళూరు జేసీ నగర్‌లోని బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే ఇంటికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీపిక తాజా చిత్రం ‘పద్మావతి’ వివాదం నేపథ్యంలో ఆమెకు కర్ణిసేన తదితర వర్గాలనుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీపిక కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉందంటూ కర్ణాటక ప్రభుత్వం ఆమె ఇంటికి పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. దీపిక తండ్రి ప్రకాశ్‌ పదుకొణె, ఆమె తల్లి ఉజ్జల, సోదరి అనీషా, నాన్నమ్మ అహిల్య బెంగళూరు ఇంటిలో ఉంటున్నారు. దీపిక బెంగళూరులో ఎక్కడ ఉన్నా సరే ఆమెకు భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి రామలింగా రెడ్డి తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం