రాఘవేంద్రుని సన్నిధిలో రజినీకాంత్


కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి మఠానికి వెళ్లిన హీరో రజనీకాంత్‌ మంగళవారం స్వామివారిని దర్శించుకున్నారు. 2.0 సినిమా విడుదల నేపథ్యంలో రజిని స్వామిని దర్శించుకున్నట్లు చెబుతున్నారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానం ఆచరించిన రజినీకాంత్ గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించారు. పీఠాధిపతి సుబుదీంద్ర తీర్థులతో కాసేపు మాట్లాడి ఆయన ఆశీర్వాదం పొందారు. ముందస్తు సమాచారం లేకుండా రజిని మఠానికి వచ్చారు. భక్తులు ఆయనతో ఫోటోలు తీసుకునేందుకు, కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం