1980 నాటి తారాగణం రీయూనియన్


1980 టైం లో దక్షిణ చిత్ర పరిశ్రమను ఉర్రూతలూగించిన సినీ తారలు అనేకసార్లు ఓ చోట కలసి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ‘80's సౌత్‌ యాక్టర్స్‌ రీ-యూనియన్‌’ పేరుతో నిర్వహించే ఈ వేడుకలో అందరూ ఒకే రంగు దుస్తులు ధరించి ఫోటోలు దిగడం కూడా ఆనవాయితీ. తాజాగా మహాబలిపురంలో28 మంది సినీ తారలు ఇలా ఎనిమిదో సారి కలుసుకున్నారు. అందరూ వంగపువ్వు రంగు దుస్తులతో ఫొటోలకు పోజులిచ్చారు. ఈసారి కొత్తగా ర్యాంప్‌ వాక్‌ కూడా నిర్వహించగా నటీమణులతోపాటు నటులు కూడా పాల్గొన్నారని సమాచారం. రెండు రోజులు వీరంతా మహాబలిపురంలో బస చేసారు. 80's స్నేహితులతో లవ్లీ వీకెండ్‌’ అంటూ రాధిక ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. చిరంజీవి, వెంకటేశ్‌, సురేశ్‌, భానుచందర్‌, శరత్‌కుమార్‌, నరేష్‌, రెహమాన్‌, జయసుధ, రాధిక, శోభన, సుహాసిని, ఖుష్బూ, రమ్యకృష్ణ, సుమలత, నదియ, రాధ, లిజీ, రేవతి తదితరులు ఈ సందడిలో పాల్గొన్నారు

ముఖ్యాంశాలు