ఆ రైలు దారి తప్పింది !


special train

మనుషులు తెలియకపోవడం చేత దారి తప్పడం సహజమే. బైక్ లు, కార్లు కూడా ఒక్కోసారి దారి తప్పుతూ ఉంటాయి. కానీ సాక్షాత్తు ఓ రైలు దారి తప్పిందంటే ఆశ్చర్యమే! కానీ ఇది నిజం. మహారాష్ట్రకు వెళ్లాల్సిన ఓ రైలు దారి తప్పి మధ్యప్రదేశ్‌కు వెళ్ళిపోయింది. ఈ రైల్లో ఉన్న1500 మంది రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సోమవారం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కిసాన్‌ యాత్ర పేరుతో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుంచి 1500 మంది రైతులు ప్రత్యేక రైలులో వచ్చారు. ఆందోళన అనంతరం వారు రైలెక్కారు. వారిని మహారాష్ట్రలో దింపాల్సిన రైలు 160 కిలోమీటర్లు వేరే మార్గంలో ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని బాన్మోర్‌ స్టేషన్‌ లో ఆగిపోయింది. మధుర స్టేషన్‌ వద్ద పడిన తప్పుడు సిగ్నల్‌ వలన రైలు దారి తప్పిందని తెలిసింది.

ముఖ్యాంశాలు