నర్సరీలకు రూపాయిన్నరకే విద్యుత్


నర్సరీలకు ప్రత్యేక రాయితీపై విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. యూనిట్ కి రూ. 1.50 వసూలు చేసే విధంగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు సిఫారసు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. నర్సరీ రైతులు ఆశించిన రీతిలో ఉచిత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అంగీకరించక పోయినా సాధారణ చార్జీల వసూలుతో విద్యుత్ సరఫరా చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించినట్లు గోరంట్ల తెలిపారు. 5 హెచ్ పి మోటారుకు ప్రస్తుత లెక్కల ప్రకారం నెలకు రూ. 7 వేలు కరెంట్ బిల్లు వస్తుంటే ఇకపై రాయితీ ద్వారా నెలకు 1100 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని అయన చెప్పారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం