భారత్ అమ్ములపొదిలో మిస్సైల్ ట్రాకింగ్ వార్ షిప్


అత్యంత రహస్యంగా భారత్ ఒక వార్ షిప్ ని నిర్మించింది. ఇది అసాధారణమైన యుద్ధ నౌక. అడ్వాన్స్డ్ బాలిస్టిక్ మిస్సైల్ -ట్రాకింగ్ వార్ షిప్ అన్నమాట. దీని నిర్మాణం ఇప్పుడు పూర్తయింది. హిందుస్థాన్ ఏరొనాటిక్స్ అత్యంత రహస్యంగా తయారు చేసిన ఈ ప్రాజెక్టు వివరాలను ఇప్పుడు రక్షణ శాఖ బయటపెట్టింది. ఈ ఆపరేషన్ సీక్రెట్ నేమ్ "VC 11184". ఇది అత్యంత అధునాతనమైన యుద్ధ నౌక. సాగరంపై సువిశాల ప్రాంతంపై నిఘాకు ఉపయోగపడే అతి పెద్ద నౌక. శత్రువులు ప్రయోగించే, వారి యుద్ధ నౌకలనుంచి దూసుకువచ్చే ఎటువంటి బాలిస్టిక్ మిసైల్స్ నైనా సరే ఈ నౌకలోని అత్యంత అధునాతనమైన నిఘా వ్యవస్థ పసిగడుతుంది. అంతే కాదు... ఆ మిస్సైల్స్ ని వెనువెంటనే నిర్వీర్యం చేయగల సామర్థ్యం కూడా దీని సొంతం. ఈ నౌక అనేక విశిష్టతలను, ప్రత్యేకతలను కలిగి ఉందని 2018 కల్లా దీనిని భారత నావికాదళంలోకి ప్రవేశ పెడతారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us