మెట్రో ప్రారంభానికి వస్తున్న ప్రధాని మోదీ


metro rail

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి వస్తున్నారు. 28 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఆయనతో వస్తారు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానికి స్వాగతం పలుకుతారు. 3.25కి వారంతా మియాపూర్‌ మెట్రోరైల్‌ స్టేషన్‌కు చేరుకుంటా రు. మోదీ మెట్రో రైలును ప్రారంభించి, మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లి వరకు ఐదు కిలోమీటర్లు అందులో ప్రయాణిస్తారు. తిరిగి మెట్రోలోనే మియాపూర్‌కు వస్తారు. తర్వాత స్టేషన్‌ ఆవరణలో ఈ ప్రాజెక్టుపై ఫోటో ఎగ్జిబిషన్ చూస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి చేరుకుని, ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లి అక్కడ జరిగే విందు లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ తిరుమ్పకుమార్తె ఇవాంకా కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. విందు అనంతరం ప్రధానమంత్రి రోడ్డు మార్గంలోనే 8.30కి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్ర యానికి వెళతారు. గవర్నర్‌, సీఎం ఇతర ప్రముఖుల వీడ్కోలు అనంతరం విమానంలో మోదీ దిల్లీ వెళతారు.

ముఖ్యాంశాలు