వాడపల్లి హుండీ ఆదాయం లెక్కింపు

తూర్పుగోదావరి జిల్లా లో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధమైన వాడపల్లి క్షేత్రంలో 22 వ తేదీ బుధవారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లోని వాడపల్లి హుండీ ఆదాయం లెక్కించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కరుటూరి నరసింహారావు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 35 రోజులకు రూ. 26,45,226 హుండీ ద్వారా వచ్చిందని, అన్న ప్రసాద వితరణ నిమిత్తం రూ. 10,47,643 విరాళాలుగా వచ్చాయని వెరసి రూ. 36,92,869   ఆదాయం లభించిందని నరసింహారావు తెలిపారు. 2 గ్రాముల బంగారం, 293 గ్రాముల వెండి కూడా వచ్చిందని, అలాగే శివాలయం హుండీలో 1,73,600 రూపాయలు వచ్చిందని పేర్కొన్నారు. గత ఏడాది లో ఇదే రోజుల్తో పోలిస్తే రెట్టింపు ఆదాయం వచ్చిందని కరుటూరి నరసింహారావు తెలిపారు.

Facebook
Twitter
Please reload

​సంబంధిత సమాచారం 
Please reload

ముఖ్యాంశాలు

ఓసీల అభివృద్ధికి సబ్ ప్లాన్ వేయాలి

September 16, 2020

1/10
Please reload

తాజా వార్తలు
Please reload

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836