వీటో పవర్ లేని సభ్యత్వం ఇస్తారట!


భద్రతా మండలిలో భారత దేశపు శాశ్వత సభ్యత్వం విషయంలో అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేసారు. వీటో పవర్‌ విస్తరణకు అవకాశాలు లేవని ఆ ప్రతినిధి ఈ సందర్భంగా స్పష్టం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాల సంఖ్యను 15కు పెంచేందుకు సుముఖంగా ఉన్నట్టు అమెరికా తెలిపింది. ఇందుకు అభ్యంతరం లేదని... ప్రస్తుత వీటో పవర్‌ నమూనాలో మార్పు చేసేందుకు మాత్రం అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ‘సంస్కరణలు చేసిన మండలి 21వ శతాబ్దం పరిస్థితులను ప్రతిబింబిస్తుందని భావిస్తున్నామని, సవాళ్లను ప్ర‌భావ‌వంతంగా పరిష్కరించేందుకు ఇది అవకాశం అవుతుందని నమ్ముతున్నామని అన్నారు. అయితే వీటో పవర్‌ విస్తరణను మాత్రం మేం వ్యతిరేకిస్తున్నాం అని అమెరికా వెల్లడించింది.

ముఖ్యాంశాలు