వాడపల్లి హుండీ ఆదాయం లెక్కింపు


తూర్పుగోదావరి జిల్లా లో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధమైన వాడపల్లి క్షేత్రంలో 22 వ తేదీ బుధవారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లోని వాడపల్లి హుండీ ఆదాయం లెక్కించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కరుటూరి నరసింహారావు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 35 రోజులకు రూ. 26,45,226 హుండీ ద్వారా వచ్చిందని, అన్న ప్రసాద వితరణ నిమిత్తం రూ. 10,47,643 విరాళాలుగా వచ్చాయని వెరసి రూ. 36,92,869 ఆదాయం లభించిందని నరసింహారావు తెలిపారు. 2 గ్రాముల బంగారం, 293 గ్రాముల వెండి కూడా వచ్చిందని, అలాగే శివాలయం హుండీలో 1,73,600 రూపాయలు వచ్చిందని పేర్కొన్నారు. గత ఏడాది లో ఇదే రోజుల్తో పోలిస్తే రెట్టింపు ఆదాయం వచ్చిందని కరుటూరి నరసింహారావు తెలిపారు.

ముఖ్యాంశాలు