స్వచ్ఛ భారత్ చిహ్నాల్లో సోమనాథ్, గంగోత్రి, చార్మినార్


స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న సుప్రసిద్ధ ప్రాంతాలను సుందరంగా, శుభ్రంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించిన కేంద్ర ప్రభుత్వం ఆ జాబితాను విస్తరిస్తూ వెళుతోంది స్వచ్ఛభారత్‌ మిషన్‌ దిల్లీలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మరి కొన్ని ప్రాంతాలకు స్వచ్ఛత గుర్తింపు ఇచ్చింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఆయా ప్రాంతాల అభివృద్ధి బాధ్యతలను ప్రభుత్వం పలు ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగిస్తుంది. ఆ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడానికి కావాల్సిన ఆర్థిక, సాంకేతిక సహకారాలను ఆయా సంస్థలు అందిస్తాయి. అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయం తదితర పది ప్రదేశాలను తొలిదశలో స్వచ్ఛ చిహ్నాలుగా ఎంపిక చేసారు. రెండో జాబితాలో తెలంగాణలోని చార్మినార్‌తో పాటు గంగోత్రి, యమునోత్రి, ఉజ్జయిని మహకాళేశ్వర్‌, గోవాలోని చర్చ్‌ అండ్‌ కాన్వెంట్‌ ఆఫ్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఆఫ్‌ ఎస్సిస్సి, ఎర్నాకులంలోని ఆదిశంకరాచార్య జన్మస్థలం కాలడి, శ్రావణబెలగొళ గోమటేశ్వర క్షేత్రం, దేవ్‌గఢ్‌ బైజ్‌నాథ్‌ ధామ్‌, బిహార్‌లోని గయాతీర్థ్‌, గుజరాత్‌ సోమనాథ్‌ మందిరం ఉన్నాయి. చార్మినార్‌ పరిశుభ్రత బాధ్యతను ఎన్టీపీసీకి అప్పగించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం