24 న నన్నయ యూనివర్సిటీలో మెగా ఉద్యోగ మేళా


ఆదికవి నన్నయ యూనివర్సిటీలో 24వ తేదీన మెగా ఉద్యోగ మేళాను నిర్వహిస్తు న్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు తెలిపారు. కౌశల్ గోదావరి, వికాస ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మేళాలో 30 ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ బి.టెక్, ఐ.టి.ఐ, డిప్లమో మరియు పీజీ చదివిన 18 - 30 సంవత్సరాలలోపు అభ్యర్థులంతా ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు నియామక పత్రాలు అందజేస్తారని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని ఆసక్తి గల నిరుద్యోగ యువతీయువకులందరూ శుక్రవారం యూనివర్సిటీ వద్ద ఉదయం 8 గంటలకు తమ బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్, ఆధార్ జిరాక్స్ కాపీలతో హాజరుకావాలన్నారు. వివరాలకు : www.kaushalgodavari.in, www.vikasajobs.com

ముఖ్యాంశాలు