అమెరికా కనుసన్నల్లో ఇవాంక  పర్యటన


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు, అయన కుమార్తె అయిన ఇవాంక భారత పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ ఉగ్రవాద బాధిత దేశం.. కాగా ఇవాంక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఉగ్రవాద సంస్థల హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఐసిస్‌ ఉగ్రవాదులు, పాక్ ముష్కరులు ఈ పర్యటన భగ్నం చేసే అవకాశాల కోసం వేచి ఉన్నారు. అందుకే ఈ పర్యటనలో ఇవాంకకు అసాధారణ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు అమెరికా అధ్యక్ష స్థాయిలోనే ఆమె భద్రతా ఏర్పాట్లు ఉన్నాయంటే అతిశయోక్తి లేదు. ఆమె భద్రత విధులన్నీ అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఇవాంక కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా మూడు వాహనాలను తెప్పిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి కుటుంబం కోసం ప్రత్యేకంగా తయారు చేసే లీమోజీన్‌ వాహనాలు ఇవి. మందుపాతరలను కూడా తట్టుకోగల వాహనాలివి. తుపాకీ తూటాల నుంచి, రాకెట్‌ లాంచర్లు, జీవ, రసాయన దాడుల నుంచీ రక్షించగలిగే ఏర్పాట్లు వీటిలో ఉంటాయి. అధునాతన సమాచార వ్యవస్థ, హాట్ లైన్ కూడా ఉంటుంది. ఇలాంటి ఏక రూపం కలిగిన 3 వాహనాలు వస్తున్నాయి. వీటిని ఇవాంక తన పర్యటనలో మార్చి మార్చి వాడనున్నారు. ముంబయి, దిల్లీ, చెన్నై అమెరికా రాయబార కార్యాలయాల నుంచి 100 మంది అధికారులను ఇవాంక పర్యటనలో ఆమెకు సహాయకులుగా ఉండేందుకు హైదరాబాద్‌ రప్పించారు. 20 మందికిపైగా ప్రత్యేక తర్ఫీదు తీసుకున్న వంటవారు వీరిలో ఉన్నారు. ఫలక్ నుమా పాలస్ లో ప్రధాని ఇచ్చే విందులో తప్ప మిగతా అన్ని సమయాల్లో ఇవాంక తమ వంటవారు చేసిన ఆహారాన్నేతీసుకుంటారు. ఇందుకు సంబంధించిన మెనూ ఇప్పటికే హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి వచ్చింది. వంటదినుసులు కూడా అమెరికా నుంచే వస్తున్నాయి. చివరికి మంచినీళ్లు కూడా అమెరికా ఏర్పాట్లే అంటే ఏ స్థాయిలో భద్రతా చర్యలు తీసుకుంటున్నారో అర్థం అవుతుంది. పైగా ప్రతి క్షణం ఆమె పర్యటనను అమెరికా వైట్ హౌస్ నుంచి సీక్రెట్‌ సర్వీస్‌ కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడబోతున్నారు. ఇంతకుముందు ఇటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని అధ్యక్ష పర్యటనలకు మాత్రమే అమెరికా వినియోగించింది. ప్రత్యేక డ్రోన్లు, నిఘా కెమెరాలు ఆమె పర్యటన మార్గంలో ఏర్పాటవుతాయి. ఆమె పర్యటించే, పరిసర ప్రాంతాలన్నింటిపైనా నిరంతరం నిఘా సాగుతుంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే అసలు ఇవాంక పర్యటన పూర్తి నివేదిక ఇప్పటికీ ఖరారు కాలేదు. చివరి క్షణ