ఇనుమడించిన వైమానిక దళ పోరాట శక్తి


భారత వైమానిక దళ పోరాట శక్తి మరింత ఇనుమడించింది. ఈమేరకు చేసిన కీలక ప్రయోగం విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యధిక వేగం కలిగిన సూపర్‌సోనిక్‌ క్రూయీజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ తొలిసారిగా సుఖోయ్‌ యుద్ధవిమానం నుంచి లక్ష్యం దిశగా కచ్చితంగా దూసుకెళ్లింది. ఇది బంగాళాఖాతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని నూరుశాతం కచ్చితత్వంతో ఛేదించింది. ఈ క్షిపణితో 290 కి.మీ.దూరంలోని లక్ష్యాలపై గురిపెట్టొచ్చు. ఇప్పటివరకూ సుఖోయ్‌ నుంచి ప్రయోగించిన క్షిపణుల్లో ఇదే అత్యంత బరువైనది (2.5 టన్నులు). దీంతో భూ, సముద్ర తలాలతోపాటు గగనతలం నుంచీ దీనిని ప్రయోగించేందుకు మార్గం సుగమమైంది. ఈ ప్రయోగం విజయవంతం అయిన అనంతరం ప్రపంచంలోనే వేగంగా దూసుకెళ్లే సూపర్‌సోనిక్‌ క్రూయీజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ సరికొత్త చరిత్ర సృష్టించిందని పేర్కొంటూ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదలచేసింది. బ్రహ్మోస్‌ నిపుణుల బృందం, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ అభినందనలు తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం