చెక్కుబుక్స్ రద్దు ఆలోచన లేదట!

బ్యాంకు చెక్‌బుక్‌లు రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తలపై కేంద్రం స్పందిస్తూ అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టంచేసింది. ఇటీవల వ్యాపారుల సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ ఈ వదంతి తెరతీశారు. ఆయన మాట్లాడుతూ చెక్‌బుక్‌ల రద్దుకు కేంద్రం యోచిస్తోందని తెలిపారు. డిజిటల్‌ లావాదేవీల పెంపుదలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో ఈ ప్రచారం వూపందుకుంది. దీన్ని ఖండిస్తున్నాం. అలాంటి ఆలోచనే లేదని ఆర్ధిక శాఖ ట్వీట్‌ చేసింది.

Facebook