రెండాకులు గుర్తు పళనిస్వామికే!


తమిళనాట అన్నాడీఏంకే పార్టీ గుర్తు రెండాకుల కేటాయింపు ఎవరికనే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం తేల్చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గానికే రెండు ఆకుల గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలో వర్గపోరు తలెత్తింది. శశికళ,పన్నీర్‌సెల్వం వర్గాలుగా విడిపోయి అధికారం కోసం తీవ్ర యత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో శశికళ వర్గానికి చెందిన యడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఒక్కటై శశికళను, ఆమె మేనల్లుడు దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇరు వర్గాలు పార్టీ గుర్తు కేటాయింపు కోసం ఈసీని ఆశ్రయించారు. ఈ గుర్తు కేటాయించేలా ఎన్నికల సంఘంలోని ఓ అధికారికి లంచం ఇచ్చేందుకు యత్నిస్తూ దినకరన్‌ దొరికిపోవడం తెలిసిందే. ఎన్నికల సంఘం చివరికి తుది నిర్ణయం వెలువరించింది.

ముఖ్యాంశాలు