సినిమా ఆడకపోయినా నష్టం లేకుండా...!


‘పద్మావతి’ చిత్రంపై దేశవ్యాప్తంగా జరుగుతున్నా రచ్చ తెలిసిందే. ఈ సినిమా పై ఇలాంటి గొడవలు ఉంటాయని ముందే ఊహించిన దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాకు రూ.140 కోట్ల బీమా చేయించారట. బీమా మొత్తంలో రూ.80 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు వస్తుంది. అల్లర్ల వలన ప్రేక్షకులు సినిమా చూడలేకపోయారని నిర్ధారణ అయినా, సినిమా సరిగ్గా ఆడకపోయినా నిర్మాతలకు బీమా డబ్బులు వస్తాయి. అయితే సినిమాను ప్రభుత్వం నిషేధిస్తే మాత్రం బీమా వర్తించదు. ఈ సినిమాకు మహారాష్ట్రకు చెందిన బ్యాంకు బీమా కల్పించినట్లు సమాచారం. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాపై ఆంక్షలు విధించలేదు కాబట్టి సినిమా ఆడకపోతే బీమా డబ్బులు వస్తాయని అంటున్నారు.

ముఖ్యాంశాలు