అక్రమ పార్సిల్ లో కేజీన్నర బంగారం

దుబాయ్ నుంచి వచ్చిన ఒక పార్సిల్ లో రూ.15 లక్షల విలువైన బంగారం దొరికింది. చెన్నై మీనంబాక్కం పన్నాట్టు తపాల కార్యాలయానికి దుబాయ్ నుంచి ఈ పార్సెల్ వచ్చింది. చెన్నై సమీపం కేళంబాక్కంలో ఉన్న మిన్హాజ అడ్రస్ తో ఇది వచ్చింది. గృహాలంకరణ వస్తువులుగా ఇది నమోదైంది. అయితే పార్శిల్‌ను చూసి తపాలాశాఖ సిబ్బంది అనుమానించి ఇన్‌కంటాక్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే తమ ఎదుట హాజరుకావాలని పార్శిల్ పై ఉన్న అడ్రస్‌కు ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసు ఇచ్చారు. అయితే దీనికి జవాబు రాలేదు. అనంతరం ఇన్‌కంటాక్స్ అధికారులు పార్శిల్‌ను విప్పి చూస్తే అందులో బరువుగా ఉన్న జగ్గు కనిపించింది. అది పగలగొట్టి చూస్తే చిన్న బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఒకటిన్నర కిలోల బంగారు కడ్డీలు ఇందులో ఉన్నాయని, వీటి విలువ 15 లక్షలని అధికారులు తెలిపారు. కాగా కిలో బంగారం మార్కెట్ ధర రూ. 30 లక్షలు కావడం గమనార్హం.