అమలాపాల్, ఫాసిల్ .. ఇదేం పని?


తప్పుడు పత్రాలు సమర్పించి పన్ను ఎగవేసిన నటి అమలాపాల్, నటుడు ఫహద్ ఫాసిల్ పై కేసు నమోదైంది. కేరళలో లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్‌పై 20శాతం (దాదాపు రూ.20లక్షల వరకు) పన్ను ఉంది. దీంతో హీరోయిన్‌ అమలాపాల్‌, హీరో ఫహద్‌ ఫాసిల్‌ తమ లగ్జరీ వాహనాలకు తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చార్జీ తక్కువగా ఉండే పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. కేరళ వాసులైన ఈ ఇద్దరు నటులు కేరళలోనే వాహనాలను కొనుగోలు చేసి పుదుచ్చేరిలో వాటిని రిజిస్టర్‌ చేసినట్లు తేలింది. తాము పుదుచ్చేరిలోనే నివసిస్తున్నట్టు వారు తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించారని దర్యాప్తులో తేలడంతో వారిపై కేరళలో కేసులు నమోదయ్యాయి.

ముఖ్యాంశాలు