అయోధ్యలో రామాలయమే ఉంటుంది


అయోధ్య రామ జన్మభూమిలో రామాలయం మాత్రమే నిర్మితమవుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. ఈ స్థలంలో వేరే నిర్మాణాలేవీ ఉండవన్నారు. కర్ణాటకలోని ఉడుపిలో శుక్రవారం జరిగిన వీహెచ్‌పీ (విశ్వ హిందూ పరిషత్) ధర్మ సంసద్‌లో ఆయన మాట్లాడారు. ‘‘అక్కడ ఉన్న ఆ రాళ్ళతోనే మనం రామాలయాన్ని నిర్మించాలి. మందిరంపై కాషాయ జెండా రెపరెపలాడే రోజు ఎంతో దూరంలో లేదు’’ అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా గో సంరక్షణ గురించి కూడా ఆయన మాట్లాడారు. గోవధను పూర్తిగా నిషేదించాలని, లేనట్లయితే మానవ సమాజం శాంతిగా జీవించలేదని వివరించారు. ఈ సమావేశాలు రెండు రోజులపాటు జరుగుతాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం