గుజరాత్ ఎన్నికల ప్రచారానికి మోదీ


ఈ నెల 27 నుంచి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. 27, 29 తేదీల్లో ఆయన సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో మొత్తం 8 భారీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తారని రాష్ట్ర భాజపా వ్యవహారాల బాధ్యుడు భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. రాష్ట్రంలో 182 అసెంబ్లీ సీట్లు ఉండగా సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 స్థానాలకు తొలిదశలో వచ్చేనెల 9న ఎన్నికలు జరగనున్నాయి.

ముఖ్యాంశాలు