చిన్న రాకెట్లతో బుల్లి ఉపగ్రహాల ప్రయోగం!


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుతవిష్కరణ దిశగా అడుగులు వేస్తోంది. ‘పీఎస్‌ఎల్‌వీ’ని కుదించి చిన్న ఉపగ్రహాల ప్రయోగానికి అనువుగా మార్చాలని నిశ్చయించింది. దీనివలన ఉత్పత్తిని, ప్రయోగాల సంఖ్యను పెంచవచ్చని ఆశిస్తోంది. ప్రస్తుతం పీఎస్‌ఎల్‌వీని సిద్ధం చేయడానికి 40 రోజుల వ్యవధి కావాలి. అయితే ఈ చిన్నరాకెట్‌ తయారీకి 3 రోజులు చాలు. ఇందులో 700 కిలోలబరువు వరకు ఉన్న ఉపగ్రహాలను ప్రయోగించవచ్చును. 2019లో ఈ తరహా చిన్న రాకెట్ ప్రయోగం ఉండవచ్చు. దీనివలన ఖర్చు సుమారు పదివంతులు తగ్గుతుంది. చిన్న ఉపగ్రహాల కోసం ప్రత్యేకంగా చిన్న రాకెట్‌ ప్రయోగాలు చేసే పధ్ధతి దీంతోనే ప్రపంచంలో మొదలవుతుంది. గత ఫిబ్రవరిలో 104 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించి చూపిన తర్వాత చిన్న ఉపగ్రహాల ప్రయోగం కోసం ఇస్రోకు భారీగా ఆఫర్లు వస్తున్నా యి. అందువలన ఈ తరహా చిన్న రాకెట్లు ఉంటే వాణిజ్యపరంగా విస్తృత ప్రయోజనం చేకూరుతుంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం