పీఎఫ్ ఖాతాలకు ఈటీఎఫ్ జమ


పీఎఫ్ ఖాతాల్లో ‘ఎక్స్ఛేంజి ట్రేడెడ్‌ ఫండ్‌’ (ఈటీఎఫ్‌)లను జమ చేయాలని ‘భవిష్యనిధి సంస్థ’ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. వచ్చే మార్చి మాసాంతానికి 4.5 కోట్ల మంది చందాదారులు తమ ఖాతాలకు ఎన్ని ఈటీఎఫ్‌ యూనిట్లు వచ్చాయో చూసుకునే వీలు ఉంటుంది. బెంగళూరు ఐఐఎంతో చర్చించి, ఆపైన ఈక్విటీ సాధనాల విలువ లెక్కింపు, చందాదారులకు వాటిని బదలాయించడంపై ఈపీఎఫ్‌వో సీబీటీ ఈ నిర్ణయం తీసుకొంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. కాగ్‌ పరిశీలనను కూడా గణాంక విధానంలో చేర్చినట్లు చెప్పారు. భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) ద్వారా కేంద్రీకృత చెల్లింపుల వ్యవస్థను అమలు చేసే ప్రతిపాదననూ ఆమోదించామని తెలిపారు. చందాదారులు తమ సొమ్ము నుంచి అడ్వాన్స్‌ తీసుకున్నప్పుడు, లేదా తమ ఖాతాను పూర్తిగా పరిష్కరించుకున్నప్పుడు ఈపీఎఫ్‌వో... వారి ఈటీఎఫ్‌ యూనిట్లను నగదుగా మారుస్తుందని అధికారులు చెప్పారు.