బిజెపి అభ్యర్థుల ఐదో జాబితా విడుదల


గుజరాత్‌ శాసనసభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులను మరికొందరిని ఖరారు చేసింది. తాజాగా ఆ పార్టీ అయిదో విడత జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో భాగంగా నవంబర్‌ 17న 70మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. రెండో జాబితాలో 36మంది పేర్లను, మూడో జాబితాలో 28 మంది, నాలుగో జాబితాలో ఒకే అభ్యర్థి పియాష్‌ భాయ్‌ దేశాయ్‌ (నవసరాయ్‌ నియోజకవర్గం) ప్రకటించింది. ఇప్పుడు ఐదో జాబితాలో 13మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండు విడతలుగా గుజరాత్‌ శాసనసభ ఎన్నికలు డిసెంబర్‌ 9, 14 తేదీల్లో నిర్వహి స్తారు. 18వ తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం