బండ్ల గణేష్ కి ఆర్నెల్లు జైలు శిక్ష


చెల్లని చెక్కు కేసులో నిర్మాత బండ్ల గణేష్‌కు జైలు శిక్ష పడింది. ‘టెంపర్‌’ సినిమాకు సంబంధించి తనకు చెల్లని చెక్కు ఇచ్చారని రచయిత వ‌క్కంతం వంశీ ఇచ్చిన ఫిర్యాదు పై శుక్రవారం హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ కోర్టులో విచారణ జరిగింది. వాదోపవాదాలను విన్న అనంతరం బండ్ల గణేష్‌కు ఆర్నెల్ల జైలు శిక్షతో పాటు, రూ.15.86 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బండ్ల గ‌ణేష్ అప్పీల్ చేసుకోవ‌డంతో న్యాయ‌స్థానం బెయిల్ ఇచ్చింది.

ముఖ్యాంశాలు