సేవలకు మిత్తల్ కేటాయింపు రూ.7 వేల కోట్లు

భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీత్ మిత్తల్ కుటుంబం సామాజిక సేవల కోసం రూ.7 వేల కోట్లు కేటాయించింది. సంస్థ తరఫున దాతృత్వ సేవలు నెరపే భారతీ ఫౌండేషన్‌కు ఈ మొత్తం ఇస్తారు. తమ కుటుంబ సంపదలో 10 శాతాన్ని దాతృత్వానికి కేటాయించినట్లు మిట్టల్ ప్రతినిధి తెలిపారు. భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ సునీల్మిత్తల్ కుటుంబానికి భారతీ ఎయిర్‌టెల్‌లో ఉన్న 3 శాతం వాటా కూడా ఇందులో భాగమే. పేద యువత, ఉచితంగా ఆధునిక నైపుణ్యాలు నేర్చుకునేందుకు సత్యభారతి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనున్నట్టు తెలిపారు. సైన్స్, టెక్నాలజీ కోర్సులపై దృష్టి సారించే ఈ భవిష్యతరం విశ్వవిద్యాలయం ప్రధానంగా కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), రోబోటిక్స్‌తో పాటు మరిన్ని కోర్సులను 2021 నుంచి ప్రవేశపెడతారు. తాము ప్రకటించిన రూ.7,000 కోట్లలో అధికభాగం ఈ విశ్వవిద్యాలయానికే కేటాయిస్తామని సునీల్ మిత్తల్ తెలిపారు.