12 మంది మావోయిస్టుల లొంగుబాటు


ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిజాపూర్‌ జిల్లాలో పన్నెండు మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. 119వ బెటాలియన్‌ సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, జిల్లా పోలీసులు గురువారం బైరామ్‌గఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో గాలింపు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటమ్‌పుర, బిరియాభూమి, దలేర్‌ గ్రామాలను పోలీసులు దిగ్బంధించడంతో ఆయా గ్రామాల్లో దాగి ఉన్న ఈ మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒక మహిళ కూడా ఉందని సమాచారం. లొంగిపోయిన వారంతా అనేక కేసులలో నిందితులు. పలు కేసులు వారిపై పెండింగ్ లో ఉన్నాయి. పోలీసులపై దాడులు, మందుపాతరలు పేల్చటం, మావోయిస్టు బ్యానర్లు కట్టటం వంటి నేరాలకు సంబంధించి కేసులు వీరిపై ఉన్నాయి.

ముఖ్యాంశాలు