పాక్ లో ఉగ్రదాడి.. ఐదుగురి మృతి

ఉగ్రదాడితో పాక్‌ రక్తసిక్తమైంది. క్వెట్టాలో భద్రతా దళాల వాహనం లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు పౌరులు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. బస్సు టెర్మినల్‌ వద్ద కాపు కాసిన ఉగ్రవాది భద్రతా దళాలతో వెళ్తున్న వాహనం రాగానే తనకు తాను పేల్చేసుకున్నాడని క్వెట్టా పోలీసు అధికారి అబిద్‌ మెంగల్‌ తెలిపారు. ఈ ఘటనకు తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ఉగ్రసంస్థ తన బాధ్యతను ప్రకటించుకుంది. గాయపడిన వారిలో భద్రతా దళాలకు చెందిన వారు కూడా ఉన్నారు. 

Facebook