పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సులో రామ్ చరణ్ ప్రసంగం


హీరో రామ్‌చరణ్‌కు గొప్ప గౌరవం లభించింది. 28 నుంచి 30 వరకూ హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో ‘సినిమా భవిష్యత్‌’ అన్న అంశంపై జరగనున్న బ్రేక్‌అవుట్‌ సెషన్‌లో ఆయన ప్రసంగించనున్నారు. నవంబర్‌ 29న ఉదయం ఆయన ప్రసంగం ఉంటుంది. అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్‌ తో పాటు దేశీయ, విదేశీ ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యాపార మెళకువలు అర్థం చేసుకోలేకపోవడానికి కారణాలు, ఏవిధంగా సినిమాని లాభసాటిగా మార్చుకుని వృద్ధి చెందాలి తదితర అంశాలను ఈ సెషన్‌లో చర్చిస్తారు. రామ్‌చరణ్‌తో పాటు, నటి అదితిరావ్‌ హైదరీ, నైజీరియన్‌ నటి ఓనీకేచి స్టెఫానీ లినస్‌, ఎస్సెల్‌ గ్రూప్‌నకు చెందిన సుభాష్‌ చంద్ర తదితరులు ఈ సెషన్ లో పాల్గొంటారు.

ముఖ్యాంశాలు