బస్సు బోల్తా .. పెద్దాపురం భక్తుని మృతి


తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం సమీపంలోని ఉలందూర్‌పేట వద్ద అయ్యప్ప భక్తుల బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,16 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చంద్రమాంపల్లికి చెందిన నూకరాజుగా గుర్తించారు. పెద్దాపురం, కిర్లంపూడి మండలాల అయ్యప్ప మాలధారులు 13న శబరిమలకు బయలుదేరి వెళ్లారు.

ముఖ్యాంశాలు