సైరా చిత్రంలో పవన్ కళ్యాణ్?


మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం సైరా సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా కనిపించబోతున్నారని ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతున్నది. 'శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్‌ చిత్రాల్లో పవన్ చిరుతో కలిసి చిన్న పాత్రల్లో నటించాడు. కాగా సైరాలో 10 నిమిషాల నిడివి కలిగిన ఒక ముఖ్యమైన పాత్ర ను స్టార్ హీరోతో చేయించాలని యూనిట్ భావించి తొలుత వెంకటేష్ ని సంప్రదించింది. అయితే వెంకీ ఈ పాత్రకు ఖరారు కాలేదు. దీంతో పవన్ కల్యాణ్‌ను సంప్రదించగా వెంటనే ఓకే అన్నట్టు తెలుస్తోంది. నయనతార కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, ముఖ్యమైన పాత్రల కోసం అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి ఎంపికయ్యారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం