హైదరాబాద్ మెట్రో చార్జీలివీ...


హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ మెట్రో రైలు ఛార్జీలను ఎల్‌అండ్‌టీ శనివారం సాయంత్రం ప్రకటించింది. టికెట్‌ కనీస ధర రూ.10, గరిష్ఠ ధర రూ.60గా నిర్ణయించారు. కిలోమీటర్ల వారీగా టికెట్‌ ధరలు ఇలా ఉన్నాయి. 2 కిలోమీటర్ల వరకు రూ.10, 2 కి.మీ. నుంచి 4 కిలోమీటర్ల వరకు రూ.15 , 4 కి.మీ నుంచి 6 కి.మీ వరకు రూ.25 , 6 కి.మీ. నుంచి 8 కి.మీ.కి రూ.30 , 8 కి.మీ. నుంచి 10 కి.మీ వరకు రూ.35 ,10 కి.మీ.ల నుంచి 14 కి.మీ. వరకు రూ.40,14 కి.మీ. నుంచి 18 కి.మీ. వరకు రూ.45 , 18 కి.మీ నుంచి 22 కి.మీ. రూ.50 22 కి.మీ. నుంచి 26 కి.మీ. రూ.55, 26 కిలోమీటర్ల పైన దూరానికి రూ.60గా టికెట్‌ ధరలు ఉన్నాయి. మెట్రో స్మార్ట్‌ కార్డులను ఆదివారం నుంచి నాగోల్‌, తార్నాక, ఎస్‌.ఆర్‌.నగర్‌, ప్రకాశ్‌నగర్‌ మెట్రో స్టేషన్లలో విక్రయించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెట్రో రైలును ప్రారంభిస్తారు. 29వ తేదీ ఉదయం 6గంటల నుంచి నాగోల్ - మియాపూర్‌ మధ్య మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి.

ముఖ్యాంశాలు