అయ్యప్పమాల ధరించిన ముస్లిం


అయ్యప్ప మాలను ధరించాడో ముస్లిం యువకుడు. తద్వారా భక్తికి కులమతాలు లేవని నిరూపించాడు. ప్రకాశం జిల్లా మండల కేంద్రానికి చెందిన నాగుర్‌ వలీ ఎనిమిదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ వచ్చి స్థిరపడ్డాడు. జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని, కష్టకాలంలో అయ్యప్పపైనే తానూ భారం వేశానని నాగుర్‌ చెబుతున్నాడు. తన కష్టాలను స్వామి అయ్యప్పే తీర్చాడని అందుకే మాల ధరించానని అతడు చెప్పాడు.

ముఖ్యాంశాలు