కంటతడి పెట్టిన రాజమండ్రి మేయర్ రజని

రాజమహేంద్రవరం రూరల్ లో వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఏర్పడిన ప్రోటోకాల్ వివాదం నేపథ్యంలో నగర మేయర్ పంతం రజనీ శేషసాయి కంటతడి పెట్టారు. శంకుస్థాపన శిలాఫలకంపై నగర మేయర్ రజనీశేషసాయి పేరు లేకపోవడంతో ఆమె ఆవేదన చెందారు. తనను కార్యక్రమానికి ఆహ్వానించక పోయినా బాగుండేదని, పిలిచి తనను అవమానించారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం కార్యక్రమం జరగకుండానే ఆమె నిష్క్రమించారు. 

Facebook
Twitter