చైతు, మారుతి చిత్రం షూటింగ్ ప్రారంభం


నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శనివారం ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు’ పేరు పరిశీలనలో ఉంది. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్‌ నాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నంబర్‌ 3గా తెరకెక్కనున్నఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్‌’ రాజు క్లాప్‌ ఇచ్చారు. జనవరి 5న చిత్రీకరణ మొదలవుతుందని, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారని మారుతి చెప్పారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ అధినేత ఎస్‌. రాధాకృష్ణ, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం