నెలలో 3 భారీ ఈవెంట్లు .. భేష్ కేసీఆర్


ఏ పని చేసినా వెరైటీగా, భారీగా చేయడం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అలవాటు. ఆయన ఆసక్తి, అభిరుచికి తగినట్టే మూడు అతి పెద్ద కార్యక్రమాలు నెల రోజుల వ్యవధిలోనే వచ్చాయి.ఈ నెల 28వ తేదీ గురువారం హైదరాబాద్ చరిత్రలో ఓ గొప్ప సందర్భం. హైదరాబాద్‌ ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న మెట్రోరైలుకు ప్రధాని నరేంద్రమోదీ ఆరోజే పచ్చజెండా ఊపుతారు. అదే రోజు మరో అతిపెద్ద విశేషం... అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభం. ఈ రెండు రోజుల సదస్సులో దేశ, విదేశాల ప్రముఖులు ఎందరెందరో పాల్గొంటారు. అది పూర్తయిన పదిహేను రోజులకే ప్రపంచ తెలుగు మహాసభల సమారోహం.. ఇది అయిదు రోజుల మహోత్సవం. మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, మెట్రోరైలు నిర్వహించే ఎల్‌ అండ్‌ టీకి యంత్రాంగం, సాహిత్య అకాడమీ యంత్రాంగం, తెలుగు భాషాభిమానులూ, మేధావులూ వీటిని చిరస్మరణీయ స్థాయిలో జయప్రదం చేసేందుకు కృషి చేస్తున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం