మక్కా, మదీనాల్లో ఫోటోలు నిషిద్ధం


ముస్లింల పుణ్యక్షేత్రం మక్కాలోని ‘ది గ్రేట్ మాస్క్ ఆఫ్ మక్కా’, మదీనాలోని మజీద్ అల్ హరం( ది ప్రొఫెట్స్ మాస్క్) ప్రదేశాలలో సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు తీసుకోవడాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధించింది. సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నవారు భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. అనేక మంది తమ సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారని ఇది మతాచారాలకు విరుద్ధమని వారన్నారు.

ముఖ్యాంశాలు