విజయవాడలో వింత పక్షులు


మొన్నటికి మొన్న విశాఖపట్నంలో కలకలం రేపిన వింత పక్షుల వ్యవహారం ఇప్పుడు విజయవాడలో చోటు చేసుకుంది. విశాఖలో రెండు పక్షులను ఒక నిర్మాణంలో ఉన్న ఇంటినుంచి అటవీశాఖ స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఇవి ఒకరకమైన గుడ్లగూబ జాతి పక్షులని, హాని చేసే రకాలు కావని నిర్ధారించారు. తాజాగా ఆదివారం విజయవాడలో ఈ వింతపక్షులు కనిపించాయి. అయ్యప్పనగర్లోని తులసీ రాం అనే వ్యక్తి ఇంటిపై ఐదు పక్షులు వాలాయి. వాటిని చూసి తొలుత ఇంట్లోనివారు భయపడ్డారు. విపరీతమైన హిస్... శబ్దాలు చేస్తుండటంతో ఆందోళన చెందారు. అయితే అవి ప్రమాదకరం కాదని తెలిసి తేలికపడ్డారు. తల్లి పక్షి వీటికి రాత్రివేళ్లల్లో వచ్చి ఆహారం పెట్టి తిరిగి వెళ్లిపోతున్నదని స్థానికులు తెలిపారు. ఇటువంటి పక్షులను ఇంతకు ముందు చూడలేదని చెబుతున్నారు.

ముఖ్యాంశాలు