సిరియాపై రష్యా బాంబులు .. 34  మంది పౌరుల మృతి


సిరియాలోని డీర్‌ ఎజార్‌ ప్రావిన్స్‌లో ఆదివారం రష్యా సైన్యం జరిపిన వైమానిక దాడులలో 34 మంది పౌరులు మరణించారు. మృతుల్లో 15 మంది పిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐసిస్‌ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న ప్రాంతాల స్వాధీనానికి రష్యా దళాలు వైమానిక దాడులు జరిపాయి. ఐసిస్‌ ఉగ్రవాదుల గుప్పిట్లో ఉన్న చివరి ప్రదేశం డీర్‌ ఎజార్‌ అని రష్యా వర్గాలు ధృవీకరించాయి. 2015 నుంచి సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌తో రష్యా సన్నిహితంగా ఉంటున్నది. ఆరకంగా ఐసిస్‌ ఉగ్రవాదులపై సిరియా పోరుకు రష్యా బాసట ఇస్తున్నది.

ముఖ్యాంశాలు