సెల్ టవర్ పై ఫాతిమా కాలేజీ విద్యార్థులు


విజయవాడలో ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థుల ఆందోళన కొత్త దోవ పట్టింది. గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి హామీ రాకపోవడంతో ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆదివారం సెల్ టవర్ ఎక్కారు. అయిదుగురు విద్యార్థులు, ఓ విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కారు. విద్యార్థుల్లో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని వారు హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ లేదా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సెల్‌ టవర్‌ దిగేది లేదని విద్యార్థులు స్పష్టం చేసారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు కూడా అక్కడ మోహరించారు. ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చిన కలెక్టర్ లక్ష్మీకాంతం విద్యార్థులతో మొబైల్ ద్వారా మాట్లాడారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పాయింట్ మెంట్ ఇచ్చారని.. అక్కడ చర్చించి సమస్యను పరిష్కరిస్తారని ఆయన చెప్పినా విద్యార్థులు ఆందోళన విరామానికి ఒప్పుకోలేదు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం