ఇచ్చాపురం టూ తడ ఆరు లైన్ల బీచ్ రోడ్


ఇచ్ఛాపురం నుంచి తడ వరకు ఆరు లైన్ల బీచ్‌ రోడ్ నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని ఆర్ అండ్ బి మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. తీరం వెంబడి 974 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారికి రూ.20వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో డీపీఆర్‌ తయారీకి ఆదేశాలిస్తామన్నారు. తెదేపా ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ సమాధానమిచ్చారు. నాలుగు భాగాలుగా ఈ రహదారిని నిర్మిస్తామన్నారు. రహదారి వెంబడి పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, పారిశ్రామిక అభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుందన్నారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి 60శాతం భూసేకరణ పూర్తయిందని తెలిపారు.

ముఖ్యాంశాలు