ఇవాంక కు సమంత బహుమతి!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె కోసం ప్రత్యేక బహుమతులు సిద్ధం చేయిస్తున్నది. తెలంగాణ చేనేత ప్రచారకర్త గా ఉన్న హీరోయిన్ సమంత ద్వారా కూడా ఒక బహుమతి ఇప్పిస్తున్నారట. ఇవాంక కోసం సమంత ఒక గొల్లభామ చీర బహుమతిగా ఇస్తారని తెలిసింది. సిద్ధిపేట నుంచి ఇటీవల సమంత కొన్ని చీరలు తీసుకొచ్చారట. వీటిలో తనకు బాగా నచ్చిన ఓ చీరను సమంత ఇవాంకకు ఇస్తారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం